చైనాకు సౌదీ షాక్, భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్…!

-

కరోనా వైరస్ సహా సరిహద్దు తగాదాల విషయంలో చైనా వ్యవహరిస్తున్న శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఎన్ని విధాలుగా గడ్డి పెట్టి హెచ్చరికలు చేస్తున్నా సరే చైనా వైఖరిలో మార్పులు రావడం లేదు. దీనితో భారత్ మొదలు చాలా దేశాలు చైనాకు వరుసగా షాక్ లు ఇస్తున్నాయి. చైనాతో చేసుకున్న వ్యాపార ఒప్పందాలను పూర్తిగా రద్దు చేస్తున్నాయి.

చైనాతో అవసరాలు ఉన్నప్పటికీ ఆ దేశంతో స్నేహం కొనసాగించే ప్రయత్నాలు చేయడం లేదు. తాజాగా సౌదీ అరేబియా ఒక కీలక నిర్ణయం తీసుకుని డ్రాగన్ కు షాక్ ఇచ్చింది. సౌదీ అరేబియా రాష్ట్ర చమురు సంస్థ అరాంకో 10 బిలియన్ డాలర్ల చైనా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును నిలిపివేసింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంది. భారత్, అమెరికా కూడా చైనాను తిరస్కరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version