ఢిల్లీ టూ లండన్ బస్ జర్నీ..!

-

సాహసయాత్రలు అంటే తెగ ఇష్టపడేవారి కోసం ‘అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్’ అనే కంపెనీ ఓ అవకాశాన్ని కల్పిస్తోంది. 2021 మే నుంచి ఢిల్లీ టూ లండన్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. 18 దేశాల మీదుగా 70 రోజుల పాటు 20వేల కి.మీ ఈ ప్రయాణం ఉంటుందని పేర్కొంది. ఈ బస్సు జర్నీ టిక్కెట్ రూ.15 లక్షలు కాగా.. 20 సీట్లు సామర్ధ్యం ఉన్న ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్స్, ఓ గైడ్, ఓ హెల్పర్ ఉంటారు. అలాగే ప్ర‌యాణికుల‌కు మార్గ‌మ‌ధ్య‌లో‌ స్టార్ హోట‌ళ్ల‌లోనే బ‌స కల్పిస్తారు.

ఏ దేశంలో ఉన్నా భార‌తీయ వంట‌కాలు ఉండేట్లు చూసుకుంటామ‌ని పేర్కొన్నారు. మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌, చైనా, కిర్గిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, క‌జ‌కిస్తాన్‌, ర‌ష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్‌, చెక్ రిప‌బ్లిక్‌, జెర్మ‌నీ, నెద‌ర్లాండ్స్‌‌, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ఈ బస్సు లండన్ చేరుకోనుంది. అయితే ఈ ప్ర‌యాణానికి వెళ్లాల‌నుకునేవారికి వీసా ఏర్పాట్లు కూడా స‌ద‌రు కంపెనీయే చేసి పెడుతుండ‌టం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version