కశ్మీర్​పై పాక్ కు సౌదీ షాక్..చమురు సరఫరా కట్

-

దశాబ్ద కాలంగా సాగుతున్న బంధానికి తెరదించితూ.. పాకిస్థాన్​కు ఆర్థిక సహాయం, చమురు సరఫరాను నిలిపివేసింది సౌదీ అరేబియా. కశ్మీర్​ అంశంలో భారత్​కు వ్యతిరేకంగా నిలబడకపోవడం వల్ల ఓఐసీ(ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్​ కోఆపరేషన్​)పై పాక్​ విదేశాంగమంత్రి మహ్మద్​ ఖురేషి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.

దీనితో పాటు సౌదీ ఇచ్చిన 1 బిలియన్​ డాలర్లను కూడా పాకిస్థాన్​ వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. 2018 నవంబర్​లో 6.2 బిలియన్​ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది సౌదీ. ఇందులో 3 బిలియన్​ డాలర్లు రుణాలు కాగా… మిగిలినవి చమురుకు సంబంధించినవి. గతేడాది ఫిబ్రవరిలో.. పాకిస్థాన్​లో పర్యటించిన సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేశారు.’మీరు మద్దతివ్వకపోతే.. ఇస్లామిక్​ దేశాల సమావేశానికి పిలుపునివ్వాలని ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ను నేను అడగాల్సి ఉంటుంది. కశ్మీర్​ విషయంలో ఆ దేశాలన్నీ మాకు మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాయి’, అని ఖురేషీ వ్యాఖ్యానించారు. ఈ హెచ్చరికలను సౌదీ తీవ్రంగా పరిగణించిందని తాజా పరిణామాలతో అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version