మీరు ఏ రిస్క్ లేకుండా అదిరిపోయే రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీరు దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. దీని వలన మీకు మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడి వస్తుంది. మరి ఇక దీని కోసం పూర్తిగా చూస్తే..
పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. దీని వలన ఎన్నో లాభాలు పొందొచ్చు. ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. దీని కోసం మీరు ఒక ఆర్థిక సంవత్సరం లో కనీసం రూ.100 డిపాజిట్ చేసినా చాలు.
లేదు అంటే గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పైగా దీని వలన పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందొచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. మీరు కావాలనుకుంటే ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్లొచ్చు.
దీనిలో మీరు రోజుకు రూ.100 పొదుపు చేసి నెల చివరిలో రూ.3 వేలను పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలంలో దాదాపు రూ.10 లక్షలు వస్తాయి. ఇది ఇలా ఉంటే వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంది.