బ్యాంకు నుండి గుడ్ న్యూస్.. రూ.35 పొదుపుతో రూ.2 లక్షలు..!

-

చాలా మంది ఈరోజుల్లో డబ్బులని ఆదా చేసుకోవాలని.. భవిష్యత్తు కోసం దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా అలానే చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఇది సూపర్ ఛాన్స్. రిస్క్ లేకుండా రాబడి పొందాలని చూస్తుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఈ అకౌంట్ ని ఓపెన్ చేస్తే ఒకేసారి చేతికి భారీ మొత్తం పొందొచ్చు. బ్యాంక్ పదేళ్ల వరకు టెన్యూర్‌తో రికరింగ్ డిపాజిట్ సేవలని అందిస్తోంది. నచ్చిన టెన్యూర్ ని మీరు ఎంపిక ఉంచుకోవచ్చు. ఎంచుకునే టెన్యూర్ ని బట్టీ రాబడి కూడా మారుతుంది. మీరు పదేళ్ల టెన్యూర్‌తో ఐసీఐసీఐ బ్యాంక్‌ లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ని ఓపెన్ చేస్తే… మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి.

10 ఏళ్ల వరకు మీరు దీనిలో డబ్బులు కట్టాలి. ఆ తర్వాత మీకు ఒకేసారి డబ్బులు వస్తాయి. 6 నెలల నుంచి మీరు టెన్యూర్ ని ఎంచుకోవాల్సి వుంది. 6 నెలల టెన్యూర్ అయితే 5.25 శాతం వడ్డీ ని మీరు పొందవచ్చు. 9 నెలల ఆర్‌డీ కి మీరు 6.5 శాతం వడ్డీ రేటు ని పొందొచ్చు. అదే 12 నెలల టెన్యూర్ అయితే 7.2 శాతం వడ్డీ వస్తుంది. 15 నెలల కి 7.6 శాతం వడ్డీ, 18 నెలలు, 21 నెలలు, 24 నెలల టెన్యూర్లపై కూడా 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. 27 నెలల టెన్యూర్ కి 7.5 శాతం వడ్డీ వస్తుంది. 30 నెలల టెన్యూర్‌పై కూడా ఇదే వడ్డీని పొందొచ్చు. 33 నెలల టెన్యూర్‌పై, 36 నెలల టెన్యూర్‌పై కూడా అంతే.

మూడేళ్ల నుంచి ఐదేళ్ల టెన్యూర్‌పై కూడా అంతే. ఐదేళ్ల నుంచి పదేళ్ల ఆర్‌డీపై 7.5 శాతం వడ్డీ వస్తుంది. పదేళ్ల టెన్యూర్‌తో ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఆర్‌డీ అకౌంట్ ని ఓపెన్ చేస్తే నెలకు రూ. 1100 చెల్లించాలని మీరు అనుకుంటే మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ. 2 లక్షలు దాకా వస్తాయి. మీరు రోజుకు దాదారూ. 35 పొదుపు చేస్తే అధిక వడ్డీ వచ్చే టెన్యూర్‌ కూడా ఎంచుకోవచ్చు. టెన్యూర్ తక్కువగా ఉంటుంది. ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటే దీర్ఘకాలంలో అధిక మొత్తాన్ని ఒకేసారి పొందొచ్చు. పదేళ్ల ఆర్‌డీ టెన్యూర్ ని ఎంపిక చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version