యూట్యూబ్‌లో జ్యోతక్క.. ప్రోమోతోనే మార్కులు కొట్టేసింది..

-

తీన్మార్‌ వార్తలతో బుల్లితెర యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన సావిత్రి అలియాస్‌ శివజ్యోతి, తరువాత బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. ఆ షో తరువాత టీవీ9లో ఇస్మార్ట్‌ న్యూస్‌కి యాంకర్‌గా కొనసాగుతుంది. శివజ్యోతి ఇప్పుడు యూట్యూబ్‌లోకి అడుగుపెట్టింది. జ్యోతక్క పేరుతో ఓ ఛానెల్‌ను మొదలుపెట్టింది. తీన్మార్‌ వార్తలతో దుమ్ము లేపనుందా…? లేక వంటా వర్పు అంటూ టిప్స్‌ చెబుతుందా..?? అసలేం చెయ్యబోతుంది అనే ప్రశ్నలకు సమాధానంగా.. నేను గుడ అచ్చిన అంటూ ఆ ఛానెల్‌తో ఏం చెయ్యబోతుందో చెబుతూ ఓ ప్రోమో వదిలింది. తనకు ఇప్పటి వరకు తోడుగా ఉన్న అభిమానులు తనను మరింత ఆశీర్వదిస్తారని చెప్పుకొచ్చింది.

నిజామాబాద్‌ ఓ చిన్న గ్రామం నుంచి ప్రయాణం ప్రారంభించిన శివ జ్యోతి.. సావిత్రి పేరుతో సంవత్సరాలపాటు తీన్మార్‌తో దూమ్‌ దామ్‌ యాంకర్‌గా ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. ఆమె పేరును కూడా మరిచిపోయేంతలా సావిత్రిగా ప్రతీ ఇంటి గడపను చేరింది. ఇక ఒక్కసారిగా బిగ్‌బాస్‌౩ తెలుగులో పార్టిసిపెట్‌ చేసి మళ్ళీ తనపేరును లైమ్‌లైట్‌లోకి తెచ్చుకోగలిగింది. ఇక బిగ్‌బాస్‌లో ఫైనల్‌కి వెళుతుందన్నంతలో వెనుదిరిగింది. కానీ అన్నిరోజులు ఆ షోలు ఉండటమే ఆమె గెలుపు.

Read more RELATED
Recommended to you

Exit mobile version