ఎస్‌బీఐ అకౌంట్ ఆన్‌లైన్‌లోనే ఇంకో బ్రాంచ్ కి ఇలా ఈజీగా మార్చుకోవచ్చు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా రకాల బెనిఫిట్స్ ని పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకు అకౌంట్ ఉందా..? ఆ అకౌంట్ ని మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా…? అయితే ఇలా ఈ విధంగా మీరు అకౌంట్ ని మార్చుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం.

మాములుగా అయితే ఇది వరకు బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చెయ్యాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈజీగా ఆన్ లైన్ ద్వారానే మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఇది వరకే ఈ ప్రాసెస్ ని తీసుకు వచ్చింది. ఆన్ లైన్ లో సింపుల్ స్టెప్స్ తో మీరు ఈజీగా అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చెయ్యచ్చు.

ముందు మీరు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత పర్సనల్ బ్యాంకింగ్ ఆప్షన్ ఓపెన్ చేయాలి.
ఇప్పుడు ఇ-సర్వీస్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
ఆ తరవాత ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ మీద నొక్కండి.
ఏ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే దాని నెంబర్ ఇచ్చేయండి.
ఆ తరవాత బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ని ఎంటర్ చేసేయండి.
ఫైనల్ గా కన్ఫామ్ బటన్ పైన క్లిక్ చేయాలి.
ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేసేయండి.
మీరు కోరుకున్న బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లోనే ట్రాన్స్‌ఫర్ అయ్యిపోతుంది.

యోనో యాప్ నుండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి:

స్మార్ట్‌ఫోన్‌లో యోనో ఎస్‌బీఐ యాప్ ని ఓపెన్ చెయ్యండి.
మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ ట్యాబ్ మీద నొక్కండి.
ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ మీద క్లిక్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్న అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి.
ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి.
సబ్మిట్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version