ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఈ నెల 30 నుంచి ఏపీలో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 30 నుంచి ఆంధ్రప్రదేశ్ వాతావరణం మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్యరేఖ ప్రాంతానికి ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
అది అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 30, 31వ తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని సూచించింది. ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.