SBI Offers: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.26 వేల భారీ డిస్కౌంట్… పూర్తి వివరాలు ఇవే..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన ఎంతో మంది బెనిఫిట్స్ ని పొందుతున్నారు. అయితే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ని వాడితే కూడా సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక వాటి వివరాలను చూస్తే… ఏకంగా రూ. 26 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. పరిమిత కాలం వరకే ఈ ఆఫర్స్ ఉంటాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారు ఈ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఇక ఏ ప్రొడక్ట్స్ మీద ఎంత తగ్గింపు ఉంటుంది అనే వివరాలను చూద్దాం. ఎజియోలో షాపింగ్ చేస్తే రూ. 1000 వరకు తగ్గింపు ఉంటుంది. క్యారెట్‌లేన్ జువెలరీపై రూ. 2 వేల డిస్కౌంట్, డొమినోస్‌లో రూ. 200 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. అందుకు ఎస్‌బీఐసీ200 ప్రోమోకోడ్ ని ఉపయోగించాల్సి వుంది. ఈ డీల్ మే 21 వరకు వుంది. ఇదిలా ఉంటే హయర్ ప్రొడక్టులపై రూ. 12,500 వరకు తగ్గింపు ఉంటుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఇది వర్తిస్తుంది.

జూన్ 30 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. జియోమార్ట్‌లో రూ. 3 వేల వరకు డిస్కౌంట్, ఎల్‌జీ ప్రొడక్టులపై రూ. 26 వేల వరకు డిస్కౌంట్ ఉంటుంది. అలానే మింత్రాలో షాపింగ్ చేస్తే రూ. 1000 డిస్కౌంట్, నైకాలో అయితే రూ. 500 తగ్గింపు ఉంది. ఈ ఆఫర్స్ మే 21 వరకే ఉంటాయి. ఒప్పొ ప్రొడక్టులపై అయితే రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్, పేటీఎం మూవీ టికెట్లపై రూ. 50 తగ్గింపు ఉంది. రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో రూ. 300 క్యాష్‌బ్యాక్ వస్తుంది. శాంసంగ్ ప్రొడక్టులపై రూ. 25 వేల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. స్విగ్గీలో ఆర్డర్ చస్తే 15 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్. ఇలా ఈ ఆఫర్స్ ని ఎస్బీఐ క్రెడిట్ కార్డు తో పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version