అన్నదాతలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్‌ 14వ విడత డబ్బులు అప్పుడే..!

-

కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటోంది. రైతుల కోసం కూడా మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే సర్కార్ రైతుల కోసం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి. ఈ స్కీము తో చాలా మంది రైతులు బెనిఫిట్ ని పొందుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందుకోవచ్చు.

ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ ద్వారా రైతులు 13వ విడత వరకు డబ్బులు పొందారు. ఇప్పుడు 14వ విడత విడుదల డబ్బులు రావాల్సి వుంది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇక ఆ వివరాలు చూస్తే.. రైతులకి మే చివరి వారం లో రూ .2,000 రానున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

ఫిబ్రవరిలో కేంద్రం 13వ విడత నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. బెల్గామ్‌లో జరిగిన ఒక సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన 13విడత వచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు 14వ భాగం విడుదలకు సమయం అయ్యింది. ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ స్కీమ్‌లో లబ్దిదారుని అయితే ఎలా తనిఖీ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకున్నట్లయితే .. అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించండి. లబ్దిదారుల స్థితిని చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version