బ్యాంక్ కస్టమర్లని హెచ్చరించిన ఎస్బీఐ…!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా.. ? అయితే తప్పక మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి…. దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఎస్బీఐ తన కస్టమర్లని అలర్ట్ చేసింది. నేటి కాలం లో ఆన్ లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే వీటి బారిన పడవద్దని బ్యాంక్ ఖాతాదారులు హెచ్చరిస్తోంది ఎస్బీఐ. నేటి కాలం లో రోజు రోజుకీ బ్యాంక్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాలు నుంచి మోసగాళ్లు బ్యాంక్ కస్టమర్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు.

 

SBI

దీంతో ఎకౌంట్ ఖాళీ అయ్యి పోతోంది. అందుకనే ఎస్బీఐ తాజాగా తమ కస్టమర్లు హెచ్చరిస్తోంది. ఇటువంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని తన కస్టమర్స్ ని ఎలర్ట్ చేసింది. ఇటువంటి మోసాలు నుంచి జాగ్రత్తగా ఉండమని సూచించింది. ఇటువంటి మోసాల బారిన తమ కస్టమర్లు పడకూడదని కొన్ని టిప్స్ ను కూడా అందించింది. కస్టమర్లు ఫిషింగ్ మోసాల తో జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ తాజాగా చెప్పింది. దీంతో పలు టిప్స్ అనుసరించాలని తెలియ జేసింది.

ఫిషింగ్ ద్వారా కస్టమర్ నుంచి బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ నెట్ బ్యాంకింగ్ , పాస్ వర్డ్, క్రెడిట్ కార్డు నెంబర్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ద్వారా వాళ్ళు బ్యాంక్ ఎకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్ సహాయం తో డబ్బులు కొట్టేస్తారు. అలానే మీరు ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు అది సురక్షితమా కాదా..? అని చెక్ చేసు కోవాలని కస్టమర్లకి సూచించింది ఎస్బీఐ. యూఆర్ఎల్ https: // నుంచి ప్రారంభమౌతోందో లేదో చూడండి. http: // అని ఉండకూడదు. అలానే మీ అకౌంట్ వివరాలు కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడమంది ఎస్బీఐ .

Read more RELATED
Recommended to you

Exit mobile version