స్టేట్ బ్యాంకు కొత్తగా చేసిన మూడు మార్పులు ఏంట౦టే…!

-

దేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం నూతన ఏడాది కొన్ని మార్పులు ప్రవేశ పెట్టింది. వినియోగదారుల సౌలభ్యంతో పాటుగా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మార్పులు చేసింది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా.

నూతన ఏడాది నుంచి మ్యాగ్నేటిక్ స్ట్రిప్ కార్డులను ఆపేసింది బ్యాంకు. వాటి స్థానంలో చిప్ కార్డులను ప్రవేశ పెట్టింది. దీనితో సైబర్ నేరాలను అరికట్టేందుకు గాను బ్యాంకు ప్రాధాన్యత ఇచ్చింది. జనవరి ఒకటి నుంచి చిప్ కార్డులు మాత్రమే పని చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు కూడా దీన్ని ప్రవేశ పెట్టాయి.

ఓటీపీ నగదు విత్ డ్రా ను కూడా కొత్త ఏడాది సందర్భంగా స్టేట్ బ్యాంకు ప్రవేశ పెట్టింది. జ‌న‌వ‌రి 1వ‌ తేది మొద‌లు రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు చేసే రూ.10వేల‌కు మించిన విత్ డ్రాలకు ఓటీపీ అవసరం. ఇత‌ర బ్యాంక్ ఏటీఎమ్ వ‌ద్ద‌ న‌గ‌దు విత్‌డ్రా చేస్తే ఓటీపీ అవ‌స‌రం లేదు. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు మీరు ఏటీఎంలో కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది.

హోం లోన్ వడ్డీలను కూడా బ్యాంకు తగ్గించింది. ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్ మార్క్ ఆధారిత రేటు25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ ప్రకటన చేసింది. దీనితో వార్షికంగా 8.05 శాతం ఉన్న ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు 7.80 శాతానికి త‌గ్గింది. ఈ నిర్ణయంతో ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేట్ల ఆధారంగా గృహ రుణం తీసుకున్న ఖాతాదారులు, ఎమ్ఎస్ఎమ్ఈ రుణ గ్ర‌హీత‌లకు 25 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ తగ్గుతుంది. కొత్తగా హోం లోన్ తీసుకునే వారికి వార్షికంగా 7.90 శాతం వ‌డ్డీకే లోన్ మంజూరు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version