న్యూ ఇయర్ సందర్భంగా ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండస్ట్రీలో చూస్తే ప్రస్తుతం అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ మాత్రమే. ప్రస్తుతం ఎస్‌బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.15 శాతం నుంచి ప్రారంభమౌతాయి. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. ఏకంగా 8.15 శాతం నుంచి 7.90 శాతానికి వడ్డీ రేటును తగ్గించింది. డిసెంబర్ 31 లోగా హోమ్ లోన్ తీసుకుంటే మీకు 2020 జనవరి 1 నుంచి 7.90 వడ్డీ రేటు మాత్రమే వర్తిస్తుంది.
డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘గృహప్రవేశ్ మంత్’ పేరుతో హోమ్ లోన్ ఆఫర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2019 డిసెంబర్ 31 లోపు హోమ్ లోన్ తీసుకునేవారికే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఒకవేళ మీరు యోనో ఎస్‌బీఐ నుంచి హోమ్ లోన్‌కు అప్లై చేస్తే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వెంటనే లభిస్తుంది. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ పొందిన తర్వాత మీరు ప్రాపర్టీ సెలెక్ట్ చేసి హోమ్ లోన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.
Give your New Year a new beginning by fulfilling your aspiration of owning your dream home. Avail a #HomeLoan from #SBI before 31st December, 2019 and enjoy a lower interest rate from 1st January, 2020. Apply through #YONOSBI to get instant In-principal approval. pic.twitter.com/izZrQJZFvY
— State Bank of India (@TheOfficialSBI) December 24, 2019