మీ కూతురు భవిష్యత్తు కోసం ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టండి… ఇక తిరుగుండదు..!

-

కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన ఈ స్కీమ్స్ వలన మనకి ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఆడపిల్లల కోసం కూడా కేంద్రం కొన్ని పథకాల్ని తీసుకు వచ్చింది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన.

ఈ స్కీమ్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ని 2015లో కేంద్రం తీసుకు వచ్చింది. కేవలం 48 గంటల్లోనే 10 లక్షల మంది ఖాతాలు తెరిచారు. ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందాలంటే కుమార్తె పేరు మీద ఖాతా తెరవాల్సి ఉంది. ఆడపిల్ల విద్య నుంచి పెళ్లి వరకు అన్ని ఖర్చులకి ఈ డబ్బు వాడచ్చు.

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ వివరాలు:

బేటీ బచావో బేటీ పఢావో మిషన్ కింద మోదీ సర్కార్ ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. బడ్జెట్ 2023 తర్వాత, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చెయ్యడానికి పోస్టల్ శాఖ ప్రచారాన్ని ప్రారంభించింది. దీని వల్ల కేవలం 48 గంటల్లోనే 10 లక్షల మంది ఈ స్కీమ్ అకౌంట్ ని ఓపెన్ చేసారు. ఆడపిల్లల పేరు మీద 15 ఏళ్ల పాటు ఖాతా ని తెరవచ్చు.
ఇందులో పెట్టిన డబ్బు కి ప్రభుత్వం ఎక్కువ వడ్డీని అందిస్తుంది.

ఈ స్కీమ్ కింద ఎంత వస్తుంది..?

సుకన్య సమృద్ధి యోజన పథకానికి కేంద్రం 7.60 శాతం వడ్డీ ని ఇస్తోంది.
మీకు సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసు లో ఈ అకౌంట్ ని తెరవవచ్చు.
కనీసం 250 రూపాయలు డిపాజిట్ చెయ్యచ్చు.
ఇందులో మీరు నెల లేదా సంవత్సరం లో ఎన్ని సార్లయినా డిపాజిట్ చేయవచ్చు.
సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టాలి.
కుటుంబంలో కేవలం ఒక ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను మాత్రమే తెరవగలరు.
10 ఏళ్ల లోపు ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version