ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు..?

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇంకో రెండు వారాల్లో డీఏ, డీఆర్‌లను పెంచే ఛాన్స్ ఉంది. డీఏ పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలం నుండి అడుగుతున్నారు. హోలీ పండుగకు ముందే దీని పై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మార్చి 1 న కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగనుంది.

అప్పుడు డీఏ పెంపు నిర్ణయాన్ని ఒప్పుకోవచ్చు. డీఆర్‌ ని కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కనీస భత్యం DA, DR డియర్‌ నెస్ వలన ఉద్యోగులకి హెల్ప్ అవుతుంది. మాములుగా కేంద్రం ఉద్యోగులకు సంవత్సరానికి రెండు సార్లు దీన్ని పెంచుతుంది. లాస్ట్ ఇయర్ జనవరి, జూలై లో డీఏ, డీఆర్‌లను పెంచారు.

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2022 లో డీఏను నాలుగు శాతం పెంచింది. దీనితో 38 శాతం డీఏ ని పొందుతున్నారు. మొత్తం 68 లక్షల మంది పెన్షనర్లు వున్నారు. ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం అమలు కావచ్చు. ప్రభుత్వం డీఏ, డీఆర్‌ల ని పెంచితే అది ఖజానా పై భారమే. మరి ప్రభుత్వం డీఏ కి సంబంధించి నిర్ణయాన్ని హోలీ పండుగకు ముందే తీసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం దీన్ని పెంచేస్తే అది ఉద్యోగులకి ఊరట ని ఇస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version