ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు నవంబరు రెండు నుండి ఏపిలో స్కూల్స్ ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈవెన్ ఆడ్ సంఖ్యల పద్దతిలో వారానికి మూడు రోజులు తగ్గకుండా అన్ని తరగతుల వారికి స్కూల్స్ నిర్వహిస్తామని తెలిపారు. నవంబరు నెలలో విద్యార్థులకు మధ్యాహ్నం వరకే స్కూల్స్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
అయితే ఆన్ లైన్ వసతులు ఉన్న విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తామని చెప్పారు. సిలబస్ తగ్గించేందుకు ఇప్పటికే ఎస్ఈఆర్టీ కసరత్తు చేస్తోందని, సెలవులు తగ్గించి స్కూల్స్ నడుపుతామని ఆయన తెలిపారు. ఇక కరోనా నియంత్రించడంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలు చాలా గొప్పవని సురేష్ అన్నారు. సీఎం జగన్ పనితీరు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా భారిన పడిన వారికి వస్తున్న సైడ్ ఎఫెక్స్ట్ కి కూడా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.