షాకింగ్‌.. మహిళల ఫొటోలను నగ్న ఫొటోలుగా మారుస్తున్నారు.. కేసు విచారిస్తున్న బాంబే హై కోర్టు..

-

సామాజిక మాధ్యమాల్లో నిత్యం మహిళలు ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఆయా మాధ్యమాల్లో ఉండే మహిళల ఫొటోలను దుండుగులు సేకరించి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరో షాకింగ్‌ విషయం తెలిసింది. అదేమిటంటే.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సహాయంతో కొందరు వ్యక్తులు మహిళలకు చెందిన ఫొటోలను ఓ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ సహాయంతో నగ్న చిత్రాలుగా మార్చి వాటిని వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారని వెల్లడైంది.

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించిన బాంబే హైకోర్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖకు ఈ విషయమై మరిన్ని వివరాలను తెలపాలని ఆదేశించింది. దీంతో అడిషనల్‌ సాలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ బుధవారం కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. హిందూస్థాన్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించిన రిపోర్టు గురించి మీకు తెలుసా ? దీనిపై సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి వివరాలను సేకరించి తెలియజేయండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా అందుకు అనిల్‌ సింగ్‌ బదులిస్తూ.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 69ఎ, 79 (3)(బి)ల ప్రకారం అలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఇందుకు స్పందించిన చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ.. ఈ మ్యాటర్‌ చాలా సీరియస్‌, కనుక మీరు వెంటనే యాక్షన్‌ తీసుకోండి.. అని చెప్పింది. అందుకు అనిల్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. సంబంధిత మంత్రిత్వ శాఖ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని, ఈ విషయాన్ని బయట పెట్టినందుకు హిందూస్థాన్‌ టైమ్స్‌కు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.

అయితే జూలై 2020 వరకు సదరు సాఫ్ట్‌వేర్‌ బారిన మొత్తం 1,03,852 మంది పడినట్లు వెల్లడైంది. వారిలో ఎక్కువ మంది రష్యాకు చెందినవారే ఉన్నారు. గత 3 నెలల కాలంలోనే అలా మహిళల చిత్రాలను ఆ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో నగ్న చిత్రాలుగా మార్చే సంఖ్య 198 శాతం వరకు పెరిగిందని సదరు రిపోర్టులో తేలింది. ఇక ఆ సాఫ్ట్‌వేర్‌ ట్రయల్‌, పెయిడ్‌ రూపంలో లభిస్తుందని, అందులో ఎవరైనా మహిళల చిత్రాలను అప్‌లోడ్ చేస్తే వారి దుస్తులు తొలగింపబడి సాఫ్ట్‌వేర్‌ చూపిస్తుందని, ట్రయల్‌ వెర్షన్‌లో ఆ సాఫ్ట్‌వేర్‌ లోగో ఉంటుందని, రూ.100 చెల్లించి కొనుగోలు చేసే పెయిడ్‌ వెర్షన్‌ అయితే నగ్న చిత్రాలపై లోగో రాదని, కనుక చాలా మంది ఈ సాఫ్ట్‌వేర్‌ను కొని సామాజిక మాధ్యమాల నుంచి మహిళల ఫొటోలను సేకరించి వాటిని నగ్న ఫొటోలుగా మారుస్తున్నారని ఆ నివేదికలో ఉంది. అందువల్లే కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version