ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 8వ,9వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14 నుంచి 6, 7 వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇక సంక్రాంతి తర్వాత ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు క్లాసులు ఉంటాయి.
ఇక ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఈ క్లాసులు ఉన్నాయి. ప్రతి తరగతికి 16 మంది మించకుండా ఉండేలా విద్యాబోధన చేయనున్నారు ఉపాధ్యాయులు. అయితే 8 9 తరగతుల వారికి రోజు విడిచి రోజు తరగతులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఇక మధ్యాహ్న భోజనం తర్వాత ఒంటి గంటన్నర వరకు మాత్రమే స్కూల్ ఉంటుంది. అయితే పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.