మందేశాక ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతారో తెలుసా.. పెద్ద కారణాలే ఉన్నాయట ?

-

కొంతమంది పార్టీలలో మద్యం సేవించిన తర్వాత అకస్మాత్తుగా ఇంగ్లీష్ లో మాట్లాడటం అందరూ గమనించే ఉంటారు. వారు పూర్తి విశ్వాసంతో  నిర్భయంగా ఇంగ్లీష్ లో మాట్లాడటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారు ప్రతి ప్రశ్నకు ఆంగ్లంలో కూడా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇది ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? వాస్తవానికి, జనం అలా చేయడం వెనుక శాస్త్రీయ కారణం ఉందట. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక పరిశోధనలో కనుగొన్నారు పరిశోధకులు. 

మత్తులో విశ్వాసం పెరుగుతుంది !

సైన్స్ మ్యాగజైన్ ‘జర్నల్ ఆఫ్ సైకోఫార్మాకాలజీ’లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, కొంతమంది 1-2 పెగ్ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కాస్త టెన్షన్ కు గురవుతారట. అందుకే వాళ్ళు ఇతర భాషలో మాట్లాడటం ప్రారంభిస్తారట, మరీ ముఖ్యంగా ఇండియాలోకి మందు బాబులు అయితే మూడో పెగ్గు నుండి చాలా మంది ఇంగ్లీషులో మాట్లాడటం ప్రారంభిస్తారు.

 

 

వ్యక్తిత్వంలో మార్పు !

ఈ పరిశోధన ప్రకారం, మద్యం తాగడం ప్రజల జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో, కొంతమంది వ్యక్తిత్వం పూర్తిగా మారుతుంది అలాగే వారి విశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగిన వెంటనే, వారు ఆ విషయాలపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. అదే విషయాన్ని వాళ్ళు మత్తులో లేనప్పుడు చేయడానికి వెనకాడతారు.

సైకలాజికల్ రీజన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి !

మరొక భాష మాట్లాడటమే కాకుండా, కొంతమంది మందుబాబులు మందేశాక వేరు వేరు పనులు చేయడం కూడా ప్రారంభిస్తారు. అంటే మామూలు సమయంలో నృత్యం చేయడానికి లేదా పాడటానికి వెనుకాడే వ్యక్తులు, కూడా తాగాక లెగ్గు కదుపుతారు. చాలా ఈజ్ తో డాన్స్ చేస్తారు. ఈ విషయాన్ని పబ్ లకు తరచూ వెళ్ళే వారు గమనించే ఉంటారు కదూ..ఇక మద్యం సేవించిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడటం లేదా ఏదైనా డాన్స్ లాంటివి చేస్తున్నా వారిని ఎగతాళి చేయడానికి బదులుగా, సైకలాజికల్ రీజన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version