Scrub Typhus Fever: దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన మరో కొత్తరకం ఫీవర్‌..దిల్లీలో గుర్తింపు

-

అదేంటో మూడేళ్ల నుంచి వెరైటీ వైరస్‌లు, వింత జ్వరాలతోనే కాలం గడిచిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి.. పోయే వాళ్లు పోతున్నారు..ఉన్నవాళ్లు జాగ్రత్తలు పాటించలేక పోతున్నారు. మనుషులు లేదు పశువులు లేదు అందరినీ ఈ వింత జ్వరాలు పట్టిపడీస్తున్నాయి. తాజాగా ఇప్పుడు కొత్త జ్వరం ఎంట్రీ ఇచ్చింది. దేశంలో ఇప్పుడు స్క్రబ్ టైఫస్ అనే జ్వరం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసులు తక్కువగానే ఉన్నా.. దీనిని అంత తేలికగా తీసుకోలేమని వైద్యులు చెప్తున్నారు. మరి దీని లక్షణాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.. ఏం చేస్తాం ఎక్కడ వైరస్‌ వచ్చినా అది ఎక్కడోలే అని లైట్‌ తీసుకోవడానికి లేదు..చెప్పలేం రేపు మన వీధిలోనే రావొచ్చు.

చాలా అరుదుగా సంభవించినప్పటికీ.. ఈ జ్వరం చాలా కాలం పాటు కొనసాగితే.. బహుళ అవయవ వైఫల్యానికి దారితీస్తుందని వైద్యులు అంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావొచ్చు. స్క్రబ్ టైఫన్​ అనే జ్వరం ఒక నిర్దిష్ట రకం క్రిమి (టిక్) కాటు వల్ల వస్తుంది. ఈ పేలు సాధారణంగా పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి. అదనంగా ఇవి పొదలు, పొలాలలో ఉంటాయి.. ప్రస్తుతం దిల్లీలో ఈ జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించారట.. వారిలో పిల్లలు, వృద్ధులే ఎక్కువ ఉన్నారని వైద్యులు తెలిపారు..

క్రిమి కాటు నుంచి కనిపించే గుర్తు లేదా మచ్చ ఒక హెచ్చరిక సంకేతం అంటున్నారు. స్క్రబ్ టైఫస్ అనేది ఒక ప్రత్యేకమైన వ్యాధి. నివేదికల ప్రకారం.. ద్వారక నుంచి దిల్లీ వచ్చిన ఓ పిల్లవాడిలో ఈ జ్వరాన్ని కనుగొన్నారు. ఈ వ్యాధి సాధారణంగా అధిక స్థాయి జ్వరానికి కారణం కాదు. అయినా అది ప్రమాదకరమే. అందుకే ఇలాంటి జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. దాని కొన్ని లక్షణాలు డెంగ్యూని పోలి ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.

స్క్రబ్ టైఫస్ లక్షణాలు..

డెంగ్యూ మాదిరిగానే.. స్క్రబ్ టైఫస్​తో బాధపడే రోగి శరీరంపై దద్దుర్లు వస్తాయి.
జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.
ఈ జ్వరం సాధారణంగా ఏడు రోజులు ఉంటుంది.
కొంతమంది రోగుల్లో శ్వాసలోపం కారణంగా..
బహుళ అవయవ వైఫల్యం సంభవించే అవకాశం ఉంది. సకాలంలో పరిష్కరించకపోతే ప్రాణం కూడా పోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version