మీరు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాద్దామని ప్రిపేర్ అవుతున్నారా..? అయితే మీకు శుభవార్త. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అభ్యర్థుల కోసం సీటెట్-2021 నమూన పరీక్ష పత్రాన్ని రిలీజ్ చెయ్యడం జరిగింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాద్దామని అనుకునే వారికి ఈ పేపర్ హెల్ప్ అవుతుంది.
ఆసక్తి వున్నవాళ్లు ఆ పేపర్ ని డౌన్లోడ్ చేసుకోచ్చు. సీబీఎస్ఈ మొదటి సారి సీటెట్‌ను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించనుంది. అందుకనే సౌకర్యం కోసం పేపర్ ని విడుదల చేసింది. సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in నుంచి అభ్యర్థులు ఈజీగా డౌన్లోడ్ చెయ్యచ్చు.
CTET ప్రశ్నపత్రం నుంచి ప్రాక్టీస్ చేస్తే మంచిగా స్కోర్ చెయ్యచ్చు. పేపర్ మొత్తం అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మేట్ లో ఉంటుంది. ఎల్లో కలర్ లో ప్రశ్నాపత్రంలో పసుపు రంగులో సరైన సమాధానంతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. ఇక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూస్తే..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ని ఓపెన్ చెయ్యాలి.
నెక్స్ట్ వెబ్‌సైట్‌లో హోమ్‌పేజీ ఓపెన్ చేసి CTET శాంపిల్ క్వశన్ పేపర్ 2021ను లింక్‌పై క్లిక్ చేయండి.
ఆ తరవాత CTET నమూనా ప్రశ్నపత్రం PDF అని ఉంటుంది.
అక్కడ మీరు CTET ప్రశ్నాపత్రం PDFని డౌన్‌లోడ్ చేసుకోండి.
డైరెక్ట్ లింక్: https://ctet.nic.in/webinfo/File/ViewFile?FileId=200&LangId=P
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.