తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఈ విడతలో మొత్తం 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 788 గ్రామాలు ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. విచిత్రమేమిటంటే..అసలు ఐదు గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగ్గా..ఆతర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతోంది. గ్రామాల్లో ఇరు వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.