అవునా? 1954 కుంభమేళాలో నెహ్రూ పాల్గొన్నారా? నిజమేనా?

-

సోషల్ మీడియా పుణ్యమాని నిజమేదో.. అబద్ధమేదో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. కొన్ని సార్లు నిజాలను అబద్ధాలుగా నమ్మాల్సి వస్తోంది.. అబద్ధాలను నిజాలగా నమ్మాల్సివస్తోంది. అదంతా సోషల్ మీడియా క్రెడిటే. తాజాగా జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. నెటిజన్లు ఆ ఫోటోపై డిబేట్ కూడా పెడుతున్నారు.

నదిలో నెహ్రూ స్నానం చేస్తున్నప్పటి ఫోటో అది. అయితే.. ఇది కుంభమేళా సీజన్ కదా. ప్రముఖ జర్నలిస్ట్, డైరెక్టర్ వినోద్ కప్రీ.. ఈ ఫోటోను షేర్ చేసి 1954 లో జరిగిన కుంభమేళాలో భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుంభమేళాలో స్నానం చేస్తున్న ఫోటో ఇది అంటూ షేర్ చేశాడు.

అయితే.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే జరిగింది. చాలామంది కప్రీ షేర్ చేసిన ఫోటో కుంభమేళ అప్పటిది కాదని.. అది 1938 లో తీసిన ఫోటో అని… నెహ్రూ తన తల్లి అస్థికలను నిమజ్జనం చేసినప్పటి ఫోటో అంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. అలహాబాద్ లోనే అస్థికలను నిమజ్జనం చేసినప్పటి ఫోటోను పట్టుకొని కుంభమేళాలో ఫోటో అంటూ అసత్య ప్రచారం చేయొద్దంటూ… వినోద్ కప్రీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version