దళపతి విజయ్ తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న ఫస్ట్ బైలింగ్వల్ మూవీ ‘వారిసు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. పొంగల్ కి ‘వారిసు’ సినిమా రిలీజ్ అయితే తమిళనాట రికార్డ్ కలెక్షన్స్ రావడం ఖాయంగానే కనిపిస్తోంది. రిలీజ్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ‘రంజితమే’ అనే ఫస్ట్ సింగల్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. తమన్ ఇచ్చిన సూపర్బ్ ట్యూన్, ఆడియన్స్ ని రిపీట్ మోడ్ లో వినేలా చేస్తోంది. వారిసు సినిమా ప్రమోషన్స్ కి అవసరమైన జోష్ ని మొదటి సాంగ్ రూపంలో ఇచ్చిన తమన్, సెకండ్ సాంగ్ తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు.
రంజితమే సాంగ్ ని విజయ్ తో పాడించిన తమన్, రెండో పాటకి మాస్టర్ ప్లాన్ వేసి శింబుని రంగంలోకి దించాడు. ఈ సెకండ్ సాంగ్ ని శింబు పాడడమే కాకుండా సినిమాలో కూడా కనిపిస్తాడట. శింబుకి తమిళనాట మంచి ఫ్యాన్ బేస్ ఉంది, తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. అలాంటి శింబు పాట పాడడమే కాకుండా తెరపై కనిపిస్తే, అతని ఫాన్స్ కూడా ‘వారిసు’ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వస్తారు. అయితే ఈ సెకండ్ సింగిల్‌ను డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు బయటకు వదులుతున్నారు. ఈమేరకు చిత్రయూనిట్ పోస్టర్‌తో కూడిన రిలీజ్ టైంను వెల్లడించింది.
#VarisuSecondSingle – #TheeThalapathy 🔥
THE BOSS is all set to arrive on Dec 4th at 4PM 💥#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @TSeries #BhushanKumar #KrishanKumar #ShivChanana #Varisu #VarisuPongal#30YearsOfVijayism pic.twitter.com/bpZIjNRLq4— Sri Venkateswara Creations (@SVC_official) December 2, 2022