సెకండ్ వేవ్ జూలై తో ముగుస్తుంది, 6 నెలలు తర్వాత మూడవ వేవ్ మొదలవుతుంది: గవర్నమెంట్ ప్యానెల్..!

-

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో మనం సతమతమవుతున్నాము. అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ జులై తో ముగుస్తుందని.. మూడో వేవ్ అయితే రెండవ వేవ్ ముగిసిన ఆరు నుండి ఎనిమిది నెలలకు మొదలవుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ ద సైన్స్ మినిస్ట్రీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఈ సైంటిస్ట్లు మే నెల ఆఖరికి నెలాఖరు వరకు 1.5 లక్షల కేసులు రోజుకి వస్తాయని జూలై నాటికి ఇది ముగుస్తుందని చెప్పడం జరిగింది.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, ఉత్తరాఖండ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ మరియు గోవా లో అధికంగా కేసులు నమోదయ్యాయని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ ప్యానల్ మెంబర్ అన్నారు.

అదే విధంగా తమిళనాడు లో మే 29 మరియు 31 నాటికి ఎక్కువ కేసులు ఎక్కువ అవుతాయని మే 19, 20 నాటికి పుదుచ్చేరి లో ఎక్కువ కేసులు నమోదు అవుతాయి. ఈస్ట్ మరియు నార్త్ ఈస్ట్ లో ఇంకా ఎక్కువ కేసులు మనం చూడొచ్చు అని చెప్పడం జరిగింది. మే 20, 21 నాటికి అస్సాంలో కేసులు ఎక్కువ అవుతాయని మేఘాలయాలో మే 30 నాటికి కేసులు ఎక్కువ అవుతాయి అని వివరించారు.

అంతే కాకుండా త్రిపుర లో మే 26, 27 నాటికి కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి అని చెప్పడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ లో కూడా ఎక్కువ కేసులు మే 22, 24 కి ఉంటాయని అంటున్నారు.

అయితే వీళ్ళ ప్రకారం రెండో వేవ్ పూర్తయిన ఆరు నుండి ఎనిమిది నెలల కి మూడవ వేవ్ వస్తుందని అంటున్నారు. అదే విధంగా చాలా మందిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని వ్యాక్సిన్ కారణంగా ఆరోగ్యం కుదుటపడుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version