కోవిడ్ 19 సెకండ్ వేవ్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటి వేవ్ లో వృద్ధులపై, అదీగాక ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారిపై ప్రభావం పడింది. కానీ సెకండ్ వేవ్ లో మొత్తం మారిపోయింది. కరోనా బారిన పడుతున్నవారిలో యువత కూడా ఎక్కువగా ఉంటున్నారు. దీనికి కారణమేంటనే విషయమై నిపుణుల చెబుతున్న సమాధానాలు..
జనవరి 1వ తేదీ నుండి ఏప్రిల్ 1వరకు చూసుకుంటే చత్తీస్ ఘడ్ లో 21-30సంవత్సరాల వయస్సు గల వారికి కరోనా ఎక్కువగా సోకింది. యువతకి ఎక్కువగా కరోనా సోకిన రాష్ట్రాల్లో చత్తీస్ ఘడ్ మొదటి స్థానంలో ఉంది. ఇంకా AIIMS ఛీఫ్ రణ్ దీప్ గులేరియా చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలోనూ యువత మీద ఎక్కువ ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని కొత్త కొత్త కరోనా రకాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, యువత మీద ఎక్కువ ప్రభావం ఉండడానికి అది కూడా ఓ కారణమే అంటున్నారు.
మొదటి వేవ్ లో యువత మీద కరోనా ప్రభావం 31శాతంగా ఉంటే, రెండవ వేవ్ లో 32శాతం గా ఉంది. అంటే, కరోనా బారిన పడుతున్న యువత 1శాతం పెరిగారన్నమాట. ఐసీఎమ్ఆర్ ఛీఫ్ బలరాం భార్గవ ప్రకారం యువత మీద ఎక్కువ ప్రభావం ఉండడానికి కారణం, వారు బయట తిరగడమే అని అంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న యువతకి కరోనా సోకే ప్రమాదం ఎక్కువైందని, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని యువత కూడా కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందికి గురయ్యారని తెలిపారు.
తీవ్ర ఇబ్బందికి గురయ్యారని తెలిపారు. ఆక్సిజన్ అందకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలగు సమస్యలు యువతలో ఎక్కువగా కనిపించాయని అన్నారు. ఇంకా, యువతకి వ్యాక్సిన్ వేయడం ఆలస్యం అవడమూ మరో కారణమని విశ్లేషిస్తున్నారు.