మార్వాడీలు… వ్యాపారంలో ఎందుకు విజయవంతం అవుతారు…!

-

దేశాన్ని బ్రిటీష్ వాడు ఆక్రమి౦చాడో లేదో తెలియదు గాని మార్వాడి వాడు మాత్రం ఆక్రమించాడు… ఇది అక్షర సత్యం… అవును దేశంలో ఏ ప్రాంతంలో చూసినా బట్టల దుకాణమో, స్వీట్ షాపో, ఫ్యాన్సీ షాపో ఇలా ఏదోక రకంగా వాళ్ళు వ్యాపారంలో ఉంటారు. ఆ స్థాయిలో వ్యాపారం చేయడం ఎవరికి సాధ్యం కాని పరిస్థితి… అసలు వాళ్ళ విజయరహస్యం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. దానికి పెద్ద కారణాలు లేవు అంటారు వారిని దగ్గరగా గమనించిన వారు… చిన్న చిన్న సూత్రాలే వాళ్ళు ఫాలో అవుతారని అంటున్నారు.

ఆర్ధిక నిర్వహణ విషయంలో ఇతరులకు పెత్తనం ఇవ్వరు వాళ్ళు… వేరే వాళ్లకు పెత్తనం ఇచ్చినా సరే నిత్యం వాటి మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇకపోతే… వ్యాపార విస్తరణ విషయంలో.. వాళ్ళు ఒక పద్దతిని అనుసరిస్తారు. ఉదాహరణకు ఒక గ్రామాన్ని తీసుకుంటే… ఆ గ్రామంలో వాళ్ళే రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేరు వేరు పేర్లతో వాళ్ళ షాపులు మొదలుపెడతారు… ఒక చోట లేనివి మరో చోట… అక్కడ లేనివి ఇక్కడ అంటూ అన్ని అందుబాటులో ఉంచుతారు… ఇక ధరల విషయంలో కూడా వ్యత్యాసాలు రెండు షాపులకు చూపిస్తారు.

ఎప్పటికప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు అనేది ఒక అవగాహనకు వస్తారు వాళ్ళు… తక్కువ ధరకు వచ్చే వస్తువులను ఇతర రాష్ట్రాల్లో నేరుగా తయారి దారుల నుంచే కొనుగోలు చేసి… వాటిని తమ తమ వ్యాపార సముదాయాలకు తరలిస్తూ ఉంటారు. ఇక కుటుంబం మొత్తం వ్యాపారంలో కష్టపడుతుంది. చిన్న వయసు నుంచే పిల్లలకు… వ్యాపారంలో మెళుకువలు నేర్పుతూ ఉంటారు. బాధ్యత అనేది వారికి చిన్న వయసు నుంచే నేర్పుతారు… ఎక్కువ ఉత్పత్తులను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచే ప్రయత్న౦ చేయడంతో… షాప్ కి వచ్చిన వాడు మరో షాప్ కి వెళ్ళే పరిస్థితి ఉండదు…!

Read more RELATED
Recommended to you

Exit mobile version