ఘనంగా మెగా ఫ్యామిలీలో సీమంతం వేడుకలు.. ఫొటోస్ వైరల్.!

-

మెగా ఇంటికి త్వరలో వారసుడు లేదా వారసురాలు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యామిలీ తమ కోడలు ఉపాసనకు సీమంతం వేడుకలు జరిపించారు. ఈసారి చిరంజీవి నివాసంలోనే ఈ కార్యక్రమాన్ని జరిపించడం విశేషం. హైదరాబాదులోని చిరు ఇంట జరిగిన ఈ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పార్టీకి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉండగా ఇటీవలే ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ లభించిన తర్వాత ఉపాసనకు ఆమె సోదరులు అనుష్పాల, సింధూరి దుబాయ్ లో సీమంతం చేసిన విషయం తెలిసిందే. కేవలం పార్టీలు మాత్రమే కాదు అనుకున్న ప్రాంతాలకు తీసుకెళ్లడంతో పాటు బలవర్ధకమైన ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఆమె ఆరోగ్యాన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే మెగా ఫ్యామిలీ సభ్యులు ఉపాసనను చాలా ప్రేమగా చూసుకుంటున్నారని అర్థమవుతుంది. మరొకవైపు ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి గైనకాలజిస్ట్ లను కూడా తీసుకురాబోతున్నారు.

మరొకవైపు మెగా అభిమానులు కూడా వారసుడు లేదా వారసురాలి కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే అందరిలాగే తాము కూడా పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము అంటూ ఉపాసన కూడా వెల్లడించింది.. పుట్టిన బిడ్డను చూసుకుంటూనే తన కెరియర్ పై కూడా దృష్టి పెడతానని తెలిపింది. ఇకపోతే ఈమెకు జూలైలో డెలివరీ డేట్ ఇచ్చినట్లు ఉపాసన తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఒకవైపు బిడ్డ కెరియర్ తో పాటు మరొకవైపు తన లైఫ్ని కూడా హ్యాపీగా లీడ్ చేస్తానని రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తానంటూ చెప్పుకొస్తుంది ఉపాసన. ఇకపోతే నెట్టింట ఉపాసన సీమంతానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version