హైదరాబాద్‌ లో దారుణం.. అమావాస్య రోజున బాలుడిని బలిచ్చిన హిజ్రా !

-

హైదరాబాద్‌ లోని సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అమావాస్య రోజున బాలున్ని బలిచ్చింది హిజ్రా. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నిన్న అమావాస్య రోజున 8 ఏళ్ల అబ్దుల్ వాహిద్ మృతి చెందాడు. బాలున్ని ఓ హిజ్రా బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

దీంతో ఆ హిజ్రా ఇంటిపై దాడి చేశారు స్థానికులు. దీంతో సనత్ నగర్ లోని అల్లాదున్ కోటి ఏరియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హిజ్రా ఇంటిని ధ్వంసం చేశారు స్థానికులు. ఇక ఆ బాలుని మృతదేహాన్ని సమీపంలోని నాలాలో గుర్తించారు స్థానికులు. అనంతరం.. రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అటు ఆర్థిక లావాదేవీల కారణంగానే బాబును హత్య చేసినట్లుగా చెబుతున్నారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version