చక్కనమ్మా చిక్కినట్టుంది..సీరత్ కపూర్ స్లిమ్ లుక్ ఫొటోలు వైరల్

-

ఉంగరాల జుట్టుతో క్యూట్ స్మైల్ తో ఇన్నోసెంట్ లుక్ తో కుర్రకారును తన వైపునకు తిప్పుకున్న యంగ్ హీరోయిన్ సీరత్ కపూర్. 2014లో సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘‘రన్ రాజా రన్’’ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ ఫిల్మ్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. ఈ సినిమా సూపర్ హిట్ కాగా సీరత్ కపూర్ పోషించిన పాత్రకు చక్కటి పేరు వచ్చింది.

సోషల్ మీడియా కే కాదు మీడియాకు దూరంగా ఉండే ఈ భామ అప్పుడప్పుడు సోషల్ మీడియా లో సడెన్ సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటుంది. తాజాగా అటువంటి సర్ ప్రైజ్ ఒకటి ఇచ్చింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా వాయిలేట్ రంగు షార్ట్ డ్రెస్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ముద్దుగా బొద్దుగా ఉండే ఈ సుందరి చిక్కిపోయిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చక్కనమ్మా చిక్కినా అందంగానే ఉంది అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘‘మా వింత గాథ వినుమా, కృష్ణ అండ్ హిస్ లీల’ చిత్రాలలో కనిపించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version