Breaking : ఏ పదవి లేకపోయినా పనిచేస్తాం : సీతక్క

-

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏ పదవి లేకపోయినా పనిచేస్తానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సీనియర్లు తమపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లనే తాము రాజీనామా చేశామని ఆమె చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేయని వాళ్లు కూడా మాట్లాడితే ఎలా సహించేదని సీతక్క ప్రశ్నించారు. పదవికి రాజీనామా చేసిన 13 మంది నేతలు.. రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న హాత్ సే హాత్ జోడో సమావేశానికి హాజరయ్యారు. ఇక టీడీపీ బ్యాగ్రౌండ్ ఉన్న 13 మంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా లేఖను మాణిక్కం ఠాకూర్ కు పంపారు. ఇదిలా ఉంటే.. ఈనెల 20 నుంచి 24 వరకు జిల్లా స్థాయిలో హాత్ సే హాత్ జోడో అభియాన్ సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశాల నివేదికలు పీసీసీకి పంపనున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు రగిల్చిన చిచ్చు పతాకస్థాయికి చేరకుంది. సీనియర్లలలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. టీపీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వంటి నేతలు హాజరై తాజా పరిస్థితులపై చర్చించారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలకు అన్యాయం చేసిన వలస వచ్చినవారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version