అటవీశాఖ దాడులపై కన్నీళ్లు పెట్టుకున్న సీతక్క !

-

పోడు భూముల సమస్యను పరిష్కరించండని కేసీఆర్‌ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే సీతక్క. కోయ పోఛగూడెంలో మహిళలు జైల్ జీవితం అనుభవించారని.. రాష్ట్రంలో ఆదివాసీలకు హక్కులేదా…? అని నిలదీశారు. ఆదివాసీలపై జరుగుతున్న అటవీశాఖ దాడులపై కన్నీళ్లు పెట్టుకున్న సీతక్క… ఇష్టం వచ్చినట్టు అధికారులు కొడితే ఊరుకునేది లేదు తిరగబడాల్సిందేనని వెల్లడించారు.

కొత్త అడవిని కొడితే గ్రామసభలు పెట్టండని.. ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తే ఎలా.. అని నిలదీశారు.
వాళ్లే అంగిలు చించుకోని వాళ్లే కేసులు పెడుతారా….ఆదివాసీలను చూస్తే కొంతమంది అధికారులకు ఎందుకంత ద్వేషమని మండిపడ్డారు. ప్రాజెక్టుల కోసం అడవిని నరికేస్తారు..ఆదివాసీలు పొట్టపోసుకోవడం కోసం అడవిని నరికితే కేసులా…అని ప్రశ్నించారు.

అందరు ఏకమై ఆదివాసీలకోసం పోరాటం చేయాలి…కోయ పోషగూడెంలో 2003 లో పోడు చేస్తే పట్టాలకు అర్హులేకదా..ఎందుకుఇవ్వడంలేదన్నారు. పోడు భూముల విషయంలో గవర్నర్ ను కలుస్తామని.. ఆదివాసీలకు పోరాట చరిత్ర ఉంది..ఎదురించాల్సిందేనని చెప్పారు. సీఎం కుర్చి వేసుకోని పరిష్కరిస్తా అన్నారు…మేము మహరాజ కుర్చీ వేస్తాం..సమస్యనుపరిష్కరించండని కోరారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version