సినిమాల్లోకి రాకముందు ‘బాబాయ్ హోటల్’లో ఎన్టీఆర్ ఏం చేశాడంటే?

-

తెలుగు వారి ఆత్మగౌరవ పతాకగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ ధ్రువతారగా నిలిచిన దివంగత ఎన్టీఆర్..ప్రతీ తెలుగు వాడికి గుర్తుండిపోయే వ్యక్తి అని చెప్పొచ్చు. పౌరాణిక, సాంఘీక, చారిత్రక సినిమాలు చేసిన ఎన్టీఆర్..స్వయం కృషితో తెలుగు చిత్ర సీమ దిగ్గజం అయ్యారు.

ఇక ఆయన రాజకీయాల్లో పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడయ్యారు ఎన్టీఆర్. ఈ సంగతులు పక్కనబెడితే..ఎన్టీఆర్ కు విజయవాడలోని ‘బాబాయ్ హోటల్’తో ప్రత్యేక మైత్రి అనుంబంధముంది.

సినిమాల్లోకి రాకమునుపు ఎన్టీఆర్.. విజయవాడలోని ‘బాబాయ్ హోటల్’కు ప్రతీ రోజు వెళ్లేవారు. అక్కడ పాలు, పెరుగు పోసేవారు. అలా ఆ హోటల్ నిర్వాహకులు, సిబ్బందితో ఎన్టీఆర్ కు అనుబంధం ఉంది. ఎన్టీఆర్ పుట్టి పెరిగింది నిమ్మకూరు అయినప్పటికీ విజయవాడలోని ‘బాబాయ్ హోటల్’ నిర్వాహకులతోనూ ఆయనకు అనుబంధం ఉంది.

ఇక సినిమాల్లోకి వచ్చిన క్రమంలో అన్న గారు ఎన్టీఆర్..తన నివాసం మద్రాస్ కు మార్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్టార్ హీరో కాగా, ‘బాబాయ్ హోటల్’ నుంచి ప్రత్యేకంగా ఓ బృందం వచ్చి ఎన్టీఆర్ ను కలిసి వెళ్తుండేది. అలా వారి కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా టైం కేటాయించేవారు. మద్రాస్ కు వచ్చిన ‘బాబాయ్ హోటల్’ బృంద సభ్యులకు ఎన్టీఆర్ అతిథి మర్యాదలు చేసి చక్కటి భోజనం వడ్డించేవారు. ఎన్టీఆర్ అలా తన ఎదుగుదలకు ఉపయోగపడిన వారిని కచ్చితంగా గుర్తుంచుకునేవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version