ఈ మధ్య కాలంలో.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వరుసగా నిరసన సెగలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి మల్లా రెడ్డికి.. రెడ్డి సంఘం సెగ తగులగా.. మొన్న కేటీఆర్కు కరీంనగర్ లో నిరసన సెగ తగిలింది.
ఏకంగా రైతులు.. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై చెప్పులే విసిరారు. అయితే.. తాజాగా.. టీఆర్ ఎస్ పార్టీ… డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు నిరసన సెగ తగిలింది. డబుల్ బెడ్రూం ఇళ్ళను అసలైన లబ్దిదారులకు పంపిణీ చేయాలి అని అడ్డుకున్నారు గ్రామ వాసులు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయడానికి వెళుతున్న ఎమ్మెల్యే ను అడ్డుకున్నారు మండలం లోని జయపురం గ్రామస్తులు… ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు గ్రామస్తులు. డబుల్ బెడ్రూం ఇళ్ళను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు,బాదితులకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.