ధోని కెప్టెన్సీ కి కేవలం 4 మార్కులు ఇచ్చిన సెహ్వాగ్.. ఎందుకో తెలుసా..?

-

నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు సారథి ధోనీ కెప్టెన్సీ సరి కొత్తగా అనిపించిన విషయం తెలిసిందే. ఎప్పుడు తాను బరిలోకి దిగి పోరాడే ధోని ఈసారి మాత్రం వెనకడుగు వేసి అనుభవం లేని యువ ఆటగాళ్లను బరిలోకి దింపీ చివరి మ్యాచు ఓటమికి కారకుడు గా మారిపోయాడు. దీంతో ప్రస్తుతం ధోనీ కెప్టెన్సీ తో అందరూ ఆశ్చర్య పోవటమే కాదు విమర్శలు సైతం చేస్తున్నారు. ఇక ధోనీ కెప్టెన్సీపై మాజీలు సైతం ప్రస్తుతం చురకలంటిస్తున్నారు.

ఇప్పటికే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ధోని వ్యవహరించిన తీరు నాయకుడి లక్షణం కాదని.. కామెంట్ చేశాడు. ఇటీవలే మరో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహా కామెంట్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ధోనీ కెప్టెన్సీ కి కేవలం నాలుగు మార్కులు మాత్రమే ఇస్తాను అంటూ తెలిపిన సెహ్వాగ్.. ధోనీ కెప్టెన్సీ తనకు నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ముందు తాను బరిలోకి దిగకుండా ఏడో స్థానంలో వచ్చి యువ ఆటగాళ్లను పంపించడం ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్.

Read more RELATED
Recommended to you

Latest news