షమీ స్థానంలో మయాంక్‌ను సెలక్ట్ చేయండి: ఎమ్మెస్కే ప్రసాద్

-

లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.గంటకు నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో పాటు..ఖచ్చితత్వం కూడిన లైన్ లెంగ్త్ బంతులు వేయడం మయాంక్ స్పెషాలిటీ. శిఖర్ ధావన్, ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో, ఆసిస్ ప్లేయర్ మ్యాక్స్ వెల్, పటిదార్ లాంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఈ స్టార్ పేసర్ దాటికి పెవెలియన్ బాట పడుతున్నారు. ఇప్పటివరకు 3 మ్యాచ్లో ఆడిన మాయాంక్ యాదవ్ 6 వికెట్లను తీశాడు. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

 

తాజాగా మయాంక్ యాదవ్ ను భారత మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ ఏకంగా టీ20 వరల్డ్ కప్ కు సెలక్ట్ చేయాల్సిందిగా కోరాడు.ప్రస్తుతం గాయంతో క్రికెట్ కు దూరమైన మహ్మద్ షమీ స్థానంలో ప్రమాదకర బౌలర్ మయాంక్ ప్రభావం చూపించగలడు. అతనికి టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండడానికి అర్హుడు అని అన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తర్వాత భారత జట్టులో మూడవ సీమర్ ఎంపికగా యూపీ స్పీడ్‌స్టర్‌ను ఎంపిక చేయాలి”. అని మాజీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version