ఇ-కామర్స్ రంగంలో మీ వృత్తిని ఇలా సెలక్ట్ చేసుకోండి..!?

-

సాంప్రదాయ కొనుగోలు పద్ధతులను వీడి ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్ ఫాంను ఎంచుకుంటున్నారు. అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మానవ జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఎలాంటి వస్తువునైనా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. కరోనా సంక్షోభం కారణంగా చాలా వరకు కంపెనీలు తమ సేవలను ఇ-కామర్స్ ద్వారా అందిస్తున్నాయి. వినియోగదారులు కూడా ఆన్‌లైన్‌లోనే సురక్షితంగా ప్రొడక్ట్స్ కొనుగోలు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెటింగ్ విస్తరించింది. దీంతో ఇందులో ఉపాధి అవకాశాలు పెరిగాయి. అయితే ఈ ఆన్‌లైన్ ఇ-కామర్స్ రంగంలో ఉద్యోగస్తులు ఎలాంటి వృత్తిని ఎంపిక చేసుకోవాలనే ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

ఇ-కామర్స్

ఆన్‌లైన్ ఉనికిని అర్థం చేసుకోవాలి..

ఆన్‌లైన్ మార్కెటింగ్ రంగంలో ప్రతిఒక్కరూ ఉనికిని తెలుసుకోవాలి. ఏ మార్కెటింగ్ ప్లాట్‌ఫాం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందో తెలుసుకోవాలి. అలాగే మీరు ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే ఆ కంపెనీ సెల్స్ పెరగడానికి మీరు ఎలాంటి టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేస్తారనేది గ్రహించాలి. ప్రస్తుతం సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఏ విషయాన్నైనా తెలియపర్చవచ్చు. మార్కెటింగ్ సేల్స్ పెరగాలంటే సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఉపయోగించుకోవాలి. మార్కెట్‌లో ఎలాంటి వస్తువులను డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. ప్రస్తుతం ప్రజల అభిరుచులు మారాయి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఇ-కామర్స్ మార్కెట్‌ను విస్తరించుకోవాలి.

విఫలమైనా.. పునఃప్రారంభించాలి..

వ్యాపార రంగంలో లాభ నష్టాలు సహజం. ఒక సారి ఇ-కామర్స్ మార్కెట్‌లో అడుగు పెట్టిన తర్వాత లాస్ వచ్చి కంపెనీలు మూతపడవచ్చు. అప్పుడు మీరు చేసిన తప్పులేంటో తెలుస్తుంది. మళ్లీ ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అప్పుడే మీరు మార్కెటింగ్ చేస్తూ.. ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.

వెబినార్ ద్వారా తెలుసుకోండి..

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవడానికి చాలా ప్లాట్ పామ్స్ వెలిశాయి. మీరు ఏ రంగాన్ని సెలక్ట్ చేసుకున్నారో.. ఆ రంగానికి సంబంధించిన క్లాసులు వినాలి. అప్పుడే మీకు ఆన్‌లైన్ మార్కెటింగ్ గురించి అవగాహన వస్తుంది. దీపక్ కనకరాజు వంటి ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ నిర్వహించే ఆన్‌లైన్ వెబినార్‌లను అటెండ్ అయి వివరాలు తెలుసుకోవచ్చు. క్లాసులు వినడం వల్ల ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై అవగాహన వస్తుంది.

బ్లాగర్ క్రియేట్ చేసుకోవడం. మీకు నచ్చిన వీడియోలు, ఆలోచనలను బ్లాగర్‌లో పొందుపర్చుకోవాలి. మీ ఆలోచనలు వేరే వ్యక్తులకు తెలిసే అవకాశాలు ఉంటాయి. మీ మార్కెటింగ్ కూడా విస్తరిస్తుంది. సోషల్ మీడియా మార్కెటింగ్‌ లేదా డిజిటల్ మార్కెటింగ్‌లో ఉంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్‌డిన్ వంటి ప్లాట్‌ఫాంలో చేరినప్పుడు మీ పనికి సులభం అవుతుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్‌ఈఓ) ద్వారా ఆన్‌లైన్ సైట్‌ను నియంత్రించడం, ర్యాంకింగ్ చేయడం ప్రధాన సవాళ్లలో ఒకటి. ఇది మీ సక్సెస్‌కు ఉపయోగపడుతుంది. వెబ్‌సైట్ డిజైనర్, వెబ్‌సైట్ డెవలపర్, కంటెంట్ రైటర్ వంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీనికి స్మార్ట్ విధానం మాత్రమే అవసరం అవుతాయి. ఇ-కామర్స్ మార్కెంటింగ్ గురించి తెలుసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మైంట్రా, బియాంగ్ వంటి ప్రసిద్ధ ఇ-కామర్స్ బ్రాండ్ల ఉద్యోగాల్లో ప్రవేశం పొందవచ్చని బియాంగ్ ఫోక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ శివం సోని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version