హ‌రికృష్ణ‌ భౌతికకాయం తో సెల్ఫీ – మనుషులం అని మరిచారు అనుకుంటా..

-

మనుషులం అని మరిచారు అనుకుంటా..

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నందమూరి హ‌రికృష్ణ‌ భౌతికకాయం తో నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రి సిబ్బంది సెల్ఫీ దిగడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డు బాయ్, గర్ల్ కలిసి నవ్వుతూ , నిస్సిగ్గుగా సెల్ఫీ దిగటం సర్వత్రా చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఆస్పత్రి సిబ్బంది వ్యవహారం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు.

దీనిపై కామినేని ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది… సెల్ఫీ దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే వారిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

సెల్ఫీల మొజులో మానవత్వాన్ని సైతం మరచిపోవడం చాలా బాధాకరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version