హైకోర్టుకు కూడా..
ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్టుకు.. సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు విభజన త్వరితగతిన చేపట్టాలని తెలంగాణ తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, కేంద్ర న్యాయ శాఖ తరుపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ లు కోర్టుని అభ్యర్థించారు. దీంతో ఏపీలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏంటని జడ్జ్ ప్రశ్నించగా నిర్మాణాలు పూర్తి కాలేదని సంబంధిత న్యాయవాది తెలిపారు. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు రెండు ప్రతిపాదనలను పెట్టింది.
తెలంగాణ సిద్ధంగానే ఉంది..
ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు భవనంలో 24 హాళ్లు ఖాళీగా ఉన్నాయి..వీటిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు..లేదా ప్రస్తుత భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం వాటా కూడా లేదని తెలిపింది. ఏపీ తరుఫు న్యాయవాది గైర్హాజరవడంతో తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తూ.. ఏపీ ప్రభుత్వం, హైకోర్టుని సంబంధిత విషయాలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.