చాయ్‌లో ఉమ్మేసి అమ్మకం.. వీడియో వైరల్.. ఇద్దరి అరెస్టు!

-

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ముస్సోరిలో ఇద్దరు వ్యక్తులు చాయ్‌లో ఉమ్మేసి కస్టమర్లకు అందిస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో టీ షాప్‌లోని ఇద్దరు యువకులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.డెహ్రాడూన్ పోలీసుల కథనం ప్రకారం..యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన నౌషాద్ హసన్ అలీ హిమాన్షు బిష్ణోయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముస్సోరీ లైబ్రరీ చౌక్‌లో టీ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు టీ చేస్తున్న పాత్రలో పదేపదే ఉమ్మివేయడం చూసి..వీడియో తీసినట్లు బిష్ణోయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.చాయ్‌లో ఉమ్మేసి వినియోగదారులకు సప్లయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుండగా.. ఇలాంటి వ్యక్తులకు దేహశుద్ది పోలీస్‌లకు అప్పగించాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version