మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీతపై పాడుతా తీయగాలో పాడే యువ సింగర్ సంచలన ఆరోపణలు చేశారు.పాడుతా తీయగా కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రైటర్ చంద్రబోస్‌లపై పక్షపాతంగా వ్యవహరిస్తు్నారని సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆరోపించారు.
సోమవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కీరవాణి కంపోజ్ చేసిన పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు ఇస్తారని సింగర్ ప్రవస్తి అన్నారు. పెళ్లిళ్లలో పాటలు పాడినందుకు తనను ఘోరంగా అవమానించారని ప్రవస్తి ఆరాధ్య ఆరోపించారు.సెట్లో తనను బాడీ షేమింగ్ కూడా చేశారని, షూటింగ్‌లో ఓ చీడపురుగులా వారంతా చూశారని సింగర్ ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేశారు.తమిళంలోనూ తాను ఎన్నో పాటలు పాడానని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన కామెంట్స్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.