మందుబాబులకు బిగ్ షాక్.. 3 రోజులు మద్యం షాపులు బంద్

-

మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో నేటి నుంచి మూడు రోజుల పాటు అనగా ఏప్రిల్ 23వ తేదీ వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ బంద్ కొనసాగనుంది. 23వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.కౌంటింగ్ జరిగే 25వ తేదీన కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news