ఉదయం నుంచి అచ్చెన్న మేటర్ తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఎవ్వరు ఊహించని రీతిలో నిన్న సీబీఐ ఎంక్వరీ వేసిన జగన్ సర్కార్… 24గంటలు గడిచే లోపే అచ్చెన్నను అరెస్ట్ చేసింది! ఈ విషయంలో కులం కార్డు తీసి చంద్రబాబు కాసేపు హడావిడి చేసినా.. అవినీతి కచ్చితంగా జరిగే ఉంటుందనే సంకేతాలు ప్రజల్లోకి పూర్తిగా వెళ్లిపోవడంతో స్పందన అంతంతమాత్రంగా ఉంది! ఆ సంగతి అలా ఉంటే… అసలు అచ్చెన్నను ఇరికించింది.. ఆ మేర ప్రభుత్వానికో, ఏసీబీకో లీకులిచ్చింది నారా లోకేష్ అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
సందర్భం వచ్చినప్పుడల్లా, వీలుకుదిరినప్పుడల్లా తన ట్విట్టర్ ఫ్రెండ్ లోకేష్ ని పలకరించడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు విజయసాయి రెడ్డి. లోకేష్ ఏ ట్వీట్ పెట్టినా, ఏ కామెంట్ చేసినా… 12 గంటలు గడిచేలోపు విజయసాయినుంచి బలమైన కౌంటర్ పడుపోతుంటుంది. ఎందుకో కానీ వారిది ఒక రాజకీయ ట్విట్టర్ బంధం! ఆ సంగతి అలా ఉంచితే… తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టు కు పరోక్ష కారణం లోకేష్ అని చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి.
చిట్టినాయుడు దెబ్బ – అచ్చెన్న అబ్బా… అని మొదలుపెట్టిన విజయసాయి రెడ్డి… “టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తోందని 900 కోట్లు మందుల కనుగోళ్ల కుంభకోణంలో కీలక డాక్యుమెంట్లను లీక్ చేసిన చిట్టినాయుడు టీం. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేయించడం.. వాటాలు పంచుకోవడం.. అడ్డం అని అనుమానం రాగానే లీకులిచ్చి ఇరికించటం. అచ్చెన్నా… ఎవరెవరు వాటాలు పంచుకున్నారో ఏసీబీకి వెళ్లడించాలి” ముగించారు. ఈ యాంగిల్ అసలు ఏ విశ్లేషకుడూ ఊహించి ఉండకపోవచ్చని ఈ సందర్భంగా ఆన్ లైన్ లో కామెంట్లు పడుతున్నాయి.