ఏపీలో సంచలనం, విధ్యార్ధులతో క్షుద్ర పూజలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. ఏకంగా తరగతి గదిలోనే… ఒక టీచర్ విద్యార్థులతోనే క్షుద్రపూజలు చేయిస్తున్నాడు. ఒక విద్యార్ధికి చెవి కమ్మలు పోవడంతో ఆ పని చేసాడు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సి.వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం… విద్యార్థిని చెవికమ్మలు పోయిన విషయం ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తెలియడంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు.

మంత్రగాడిని పిలిపించి అంజనం వేయిస్తే దొంగ దొరుకుతాడని, ఆదివారం తలస్నానం చేసి స్కూలుకు రావాలని విద్యార్థులను ఆదేశించాడు. అందరూ తల స్నానం చేసి స్కూలుకు వెళ్ళగా… మంత్రగాడు స్కూల్ లో సిద్దంగా ఉన్నాడు. విద్యార్థుల చేతి గోళ్లపై పసరు రాసి మంత్రం పఠిస్తున్న సమయంలో ఓ విద్యార్థి తాత స్కూలుకు వచ్చి… దీంతో అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసాడు.

పిల్లలతో ఎం చేస్తున్నారని ప్రశ్నించగా కంగారు పడిన మంత్రగాడు అక్కడి నుంచి పారిపోయాడు. పెద్ద ఎత్తున స్కూల్ కి గ్రామస్తులు చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీచర్ ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్పందించిన విద్యాశాఖా అధికారి… చక్రేనాయక్, ఈ ఘటనపై విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version