రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తన కూతురు తక్కువ కాస్ట్ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందని అమృత తండ్రి ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనానికి తెరలేపింది.