ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన ఈ రోజు మూడవ వన్ డే మరియు సిరీస్ డిసైడర్ జరగనుంది. గత రెండు మ్యాచ్ లలో చెరొకటి గెలవగా సిరీస్ సమంగా ఉంది. నిర్ణయాత్మకైన మూడవ వన్ డే లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ సొంతం కానుంది. కాగా కాసేపటి క్రితమే టాస్ పడగా, వెస్ట్ ఇండీస్ కెప్టెన్ షై హోప్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో లగే ఇందులోనే మొదటగా బౌలింగ్ చేసి ఇండియాను తక్కువ స్కోర్ కె అల్ అవుట్ చేసి మ్యాచ్ పై పట్టు సాధించాలని ప్లాన్ లో ఉన్నారు. కాగా ఇండియా లో ఈ రోజు కూడా రోహిత్ మరియు కోహ్లీ లు మ్యాచ్ లో లేకపోవడం గమనార్హం. ఈ ఒక్క విషయం చాలు ఈ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ ఫేవరేట్ అని చెప్పడానికి, కాగా ఇండియా జట్టులో రెండు కీలక మార్పులు జరిగాయి.. ఉమ్రాన్ మాలిక్ కు బదులుగా ప్లేయింగ్ ఎలెవన్ లో ఋతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.
ఇక అక్షర్ పటేల్ కు బదులుగా ఉనద్కట్ వచ్చాడు. ఇక ఈ మధ్యనే ఆసియా గేమ్స్ కు కెప్టెన్ గా ఋతురాజ్ ను ప్రకటించగా ఆ తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే.. మరి ఇందులో కొత్త కెప్టెన్ రాణిస్తాడా అన్నది చూడాలి.