మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కుక్కులు మిమ్మల్నే చూస్తున్నాయా..?

-

దెయ్యాలు, ఆత్మలను నేచర్‌ త్వరగా కనిపెడుతుందని పండితులు అంటారు. భూకంపం వచ్చేది కూడా ముందే జంతువులకు తెలుస్తుంది. దీనిపై సైంటిస్టులు కూడా కొన్ని అధ్యయనాలు చేసి అవునని నిరూపించారు. అలాగే కుక్కలు, పిల్లులు నెగిటివ్‌ ఎనర్జీని ముందే గ్రహిస్తాయని పండితులు చెప్తున్నారు. అయితే ఈరోజు మీకు కొన్ని ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ చెప్పబోతున్నాం.

మీరు రాత్రుళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు కుక్క లేదా పిల్లి మిమ్మల్ని గుర్రుగా చూస్తున్నాయా..? మీరు వాటికి ఆకలేసి అలా చూస్తుంది అనుకోని ఆహారం తెచ్చిపెట్టిన సందర్భాలు కూడా ఉండే ఉంటాయి కదా. కానీ దానికి కారణం.. ఆ టైమ్‌లో మీ కంటికి కనబడని ఏదో వాటికి కనిపించిందని అర్థం. అది ఆత్మ అయి ఉండొచ్చు.

అలాగే మన పెద్దోళ్లు రాత్రుళ్లు విజిల్స్‌ వేయొద్దని అంటారు. ఎందుకు అంటే వేయకూడదు మంచిది కాదంటారు. కానీ దానికి అసలు కారణం ఏంటంటే.. మీరు రాత్రిపూట విజిల్‌ వేస్తే కొన్ని అన్‌ఇన్‌వైటడ్‌ గోస్టులకు వెల్కమ్‌ చెప్పినట్లే నట. అలా విజిల్‌ వేస్తే.. దెయ్యాలు వస్తాయట.

మీరు రాత్రి లాంగ్‌ జర్నీ చేస్తున్నట్లైతే పెద్దొళ్లు ఒక బొగ్గు ముక్కను మీకు ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే.. పెట్టుకెళ్లండి మంచిది అంటారు. అలా బొగ్గును ఇవ్వడానికి కారణం ఏంటంటే.. మీ వెనుక ఏ ఆత్మ రావొద్దని.

ఇలాంటివి పెద్దోళ్లకు బాగా తెలుసు. కానీ కొంతమందికే వీటి వెనుక ఉన్న కారణాలు తెలుస్తాయి. అవి వాళ్లు చెప్పలేకపోతే అంతా సోది అని కొట్టిపారేయకండి. పెద్దోళ్లు ఏం చెప్పినా దానికి ఒక రీజన్‌ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వాటిని ఫాలో అయితే మంచిది. సైంటిఫిక్‌గా కనిపెట్టినవే నిజాలు అంటే మనం అసలు చాలా వాటిని నమ్మకూడదు. కానీ అలా చేయడం లేదు కదా..! దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా అంటే కొందరు అవును ఉన్నాయి అంటారు. మరికొందరు అదంతా మీ భ్రమ మాత్రమే అంటారు. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు దెయ్యం ఉందని నమ్ముతారు. నమ్మితీరాల్సేందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version