భారత్ తో జరుగుతున్న 5వ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. 378 పరుగుల విజయలక్ష్యంతో ఓవర్నైట్ స్కోరు 259/3 తో ఐదవ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన స్టోక్స్ సేనా మరో వికెట్ కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. అయితే ఓటమి షాక్ లో ఉన్న టీమిండియా కు బిగ్ షాక్ తగిలింది.
ఊహంజని పరాజయంతో తీవ్ర బాధలో ఉన్న టీమిండియా కు ఊహించని షాక్ ఇచ్చింది icc. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు భారత జట్టుపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.
ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్ లో టీమిండియా కు రెండు పాయింట్లు కోత వేయడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40% జరిమానా విధించాడు. ఇదే సిరీస్ తొలి టెస్ట్ లో అలాగే ఆ తర్వాత దక్షిణాఫ్రికా తో జరిగిన సెంచూరియన్ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసి లో 5 పాయింట్లు కోల్పోయింది.