సెక్స్ చేశారా అంటే డ్రింక్స్ తీసుకున్నారా అని అర్థమా! అదేంటీ ఆ అర్థం ఎలా వస్తుంది? డ్రింక్స్ తీసుకున్నారా అని అడుగాలనుకుంటే చక్కగా.. డ్రింక్స్ తీసుకున్నారా అనే అడుగొచ్చుగా! సెక్స్ చేశారా అని అసభ్యంగా అడుగడం దేనికి? ఇదేం కోడ్ లాంగ్వేజ్. ఇది కోడ్ లాంగ్వేజే అయితే దీన్ని సృష్టించిన గత్తరోడు ఎవడు? ఇవేగా మీ మనసులో మెదులుతున్న ప్రశ్నలు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే విషయంలోకి వెళ్దాం మరి..
విషయమేందో తెలుసుకోవాలంటే ముందుగా మనం ఫిబ్రవరి 7న విడుదలైన ‘మలంగ్’ సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో హీరోయిన్ దిశా పటానీ, హీరో ఆదిత్యరాయ్ కపూర్ మస్తు రొమాన్స్ చేశారు. ఒక సీన్లోనైతే హీరో బీచ్‌లో నిలబడి ఉంటే.. హీరోయిన్ అతని భుజాలపై కూర్చుని ముందుకు వంగి లిప్‌లాక్ చేస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం హీరో, హీరోయిన్ ఇటీవల ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఒక ప్రశ్న వారిని షాకయ్యేలా చేసింది. ఇంతకూ ఆ ప్రశ్నేందో తెలుసా.. ‘మీరు మలంగ్ సినిమా కోసం బీచ్‌లో ఎన్నో రొమాన్స్ సీన్లు చేశారు కదా! మరి సెక్స్ కూడా చేశారా?’ అని. ఈ ప్రశ్న వినగానే హీరో, హీరోయిన్‌కు యాంకర్ చెంపలపై చెడామడా వాయించాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆలోపే యాంకర్ అసలు విషయం చెప్పడంతో నవ్వుకోవడం వాళ్ల వంతయ్యింది. అసలు విషయం ఏందంటే.. ‘సెక్స్ ఆన్ ద బీచ్’ అనేది ఒక డ్రింక్ పేరట. ఆ డ్రింక్ తీసుకున్నారా అని అడుగడానికి బదులుగా యాంకర్ తన పైత్యాన్ని జోడించి సెక్స్ చేశారా? అని అడిగాడట.
కొత్తగా వచ్చిన ‘సెక్స్ ఆన్ ద బీచ్’ అనే ఈ డ్రింక్ గురించి చాలామందికి తెలియదు. ఇది ఓడ్కాతో కూడిన ఒక రకమైన ఆల్కహాలిక్ కాక్‌టెయిల్. పీచ్ స్నాప్స్, ఆరంజ్ జ్యూస్, క్రాన్‌బెర్రీ జ్యూస్ మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారట. అర్థమైందిగా యాంకర్ డ్రింక్స్ తీసుకున్నారా? అని అడుగడానికి బదులుగా సెక్స్ చేశారా? అని ఎందుకు అడిగాడో. అదండీ సంగతి.