లైంగిక వేధింపులు.. ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి

-

లైంగిక వేధింపులు తాళలేక ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. గత నెల 23న అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకున్న నాగాంజలి బొల్లినేని KIMS ఆసుపత్రిలో 12 రోజులుగా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. విషయం తెలియడంతో బాధితురాలి నాగాంజలికి న్యాయం చేయాలని కిమ్స్ ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

ఇదిలాఉండగా, కిమ్స్ ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వలనే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని నాగాంజలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.నిందితుడు దీపక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.నాగాంజలి మృతిపై రాజమండ్రి డీఎస్పీ రమేష్ బాబు సైతం స్పందించారు. విచారణ అనంతరం బాధితురాలికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version